
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాంనరేశ్ నగర్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసులతో కలిసి కాలనీ లో పాదయాత్ర చేసిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా రాం నరేష్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో మౌలిక వసతులు కలిపించినదుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అదేవిధంగా కాలనీ లో సీసీ రోడ్లు వేయాలని,డ్రైనేజి వ్యవస్థ ను మరియు మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చలని, PAC చైర్మన్ గాంధీ దృష్టికి తీసుకు రావడం జరిగినది.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రాం నరేష్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో పాదయాత్ర చేయడం జరిగినది అని , రాం నరేష్ నగర్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. త్వరలనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, త్వరలోనే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకుందాం అని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, కాలనీ లో మంచి వాతావరణం కల్పిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని రోడ్ల ను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, పొంగుతున్న మ్యాన్ హోల్ ల వద్ద పునరుద్ధరణ చేస్తామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు , మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల పనులు వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగేలా చూడలని, సమస్యను త్వరలోనే పరిష్కరించాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
అలీ తలబ్ చెరువును త్వరలోనే సుందరికరణ పనులు చేపట్టి సుందర శోభితవనం గా తీర్చిదిద్దుతామని త్వరలోనే చెరువుకు మహర్దశ కలిపిస్తామని, చుట్టుపక్కల ప్రాంత కాలనీ వాసులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని, శుద్ధ జలం తో చెరువు నింపి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
