
మార్క్ ఆరోగ్యం మెరుగుపడింది: పవన్ కళ్యాణ్
మార్క్ ఆరోగ్యం మెరుగుపడింది: పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. తాజాగా మార్క్ ఆరోగ్యంపై స్పందించారు. ప్రస్తుతం మార్క్ కోలుకున్నాడని, ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అలాగే తన కుమారుడు కోలుకోవాలని పూజలు చేసి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
