
సంవిధాన్ బచావో ర్యాలీ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధ్యక్షతన, మల్కాజిగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఆధ్వర్యంలో ఏఐసిసి సెక్రెటరీ,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జ్ విష్ణునాథ్ ముఖ్య అతిధిగా నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశం మరియు జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం నుండి వి.బి.ఆర్ వరకు నిర్వహించిన సంవిధాన్ బచావో ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి . ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్లు బండ్రు శోభారాణి ,ఉజ్మాశాకిర్ ,పారిజాత నరసింహ రెడ్డి ,దుర్గం భాస్కర్ ,మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి ,కూన శ్రీశైలం గౌడ్ ,ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి ,మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్ ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ,కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేశ్ మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు,బ్లాక్ అధ్యక్షులు,డివిజన్ అధ్యక్షులు,మున్సిపల్ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు,కార్యకథలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
