
వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం ఆడిట్ పేరా ల పై అసెంబ్లీ భవనాల కమిటీ హాల్ నెం.1లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో సభ్యులు టి.భాను ప్రసాదరావు , రేవూరి ప్రకాష్ రెడ్డి , అహ్మదిబిన్ అబ్దుల్లా బాలల మరియు అకౌంటెంట్ జనరల్ శ్రీమతి పి. మాధవి , అసెంబ్లీ లేజిస్లేచర్ డాక్టర్.వి నర్సింహా చార్యులు మరియు వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీమతి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు మరియు ఇతర అధికారులు హాజరైనారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడలని ,పేద ప్రజలు ఎవరు వైద్యం కోసం ఇబ్బది పడవద్దు అని, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరీక్షల కోసం వచ్చే వారికి అన్ని రకాల వసతులు కల్పించాలని, వైద్య పరీక్షలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడలని, వైద్య పరీక్షల కోసం వాడే పరికరాల వాడకం, నిర్వహణ సక్రమంగా చూడలని, నిరంతరం పర్యవేక్షించాలని, అన్ని పరీక్షలు ఒకే చోట జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ ను మెరుగుపచాలని , బస్తీ దవాఖానలలో వైద్య నిర్వహణ పనితీరు మెరుగుపర్చాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేయాలని, నిత్యము పర్యవేక్షణ చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఆడిట్ పేరా 3.7 క్రియ రహిత పరికరాలు, ఆడిట్ పేరా 3.5 మానసిక ఆరోగ్య సంస్థ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు గూర్చి. ఆడిట్ పేరా 3.4 రక్త భాగాల కారకాల యూనిట్ల పనితీరు , ఆడిట్ పేరా 3.10 పీజీ సీట్ల పెంపు కోరుకు ,ప్రభుత్వ కళశాలను బలోపేతం మరియు ఉన్నతికరణ చేయడం , ఆడిట్ పేరా 3.11 పనిచేయని మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ల గూర్చి సవివరంగా చర్చించినారు.
