
10 తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం.
వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేసిన విద్యార్థిని విద్యార్థులు
సూర్యపేట జిల్లా : సూర్యాపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టేకుమట్లలో పదవ తరగతి ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని 9వ తరగతి విద్యార్థులు నిర్వహించారు. వీడ్కోలు సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైద పాపయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి పడవతరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలను సాధించి పాఠశాలకు మంచిపేరు తేవాలని పేర్కొన్నారు. పరీక్షల్లో అక్షర దోషాలు లేకుండా అందంగా రాయాలని పరీక్షల మెలుకువలను విద్యార్థులకు తెలియజేశారు. లక్ష్యాలు నిర్దేశించుకుని లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి అధికంగా ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తర్వాత అంగరంగ వైభవంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో కోలాహలంగా విద్యార్థిని విద్యార్థులు పాటలు స్టెప్పులతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కోటిరెడ్డి, సలహా బేగం, కిరణ్ కుమార్, వసంత, మంజుల, రాధిక, జోసెఫ్,కర్ణాకర్ రెడ్డి, అభిబ్, సుభాషిని, తదితరులు పాల్గొన్నారు.
