
హోటల్ దాబా యజమానులతో సమావేశం
హోటల్స్ వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు సూచించారు
డాబాలు, హోటళ్లను నిర్ణీత సమయంలో వ్యాపారాలు ముగించుకోవాలి
మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్
దాబా, హోటల్ యజమానులు నిర్ణీత సమయంలో వ్యాపారాలను ముగించుకోవాలని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ సమావేశం నిర్వహించారు. మంగళవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ దాబా హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు.అన్ని హోటల్స్ వద్ద నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని యజమానులకు తెలిపారు. సమయపాలన పాటించకపోయినా, వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేసిన ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దాబా, హోటల్ యజమానులను ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు.
