Spread the love

ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

అమరావతి :
వచ్చే పది రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.

టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని, జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు..

గతంలోనేడీఎస్సీ నోటిఫికే షన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు కేబినెట్​లోనూ తీర్మానం చేసింది.మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది.

ఆయా జిల్లాల్లోని స్థానికుల తోనే 80 శాతం ఉపాధ్యా య ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 ఖాళీలు ఉన్నాయి.

అలాగే విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉండనున్నాయి.మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతిమ లబ్ధిదారు వరకూ ఫలాలు చేరాల్సిందేనని, మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.