
మంత్రి భట్టి విక్రమార్క మల్లు పర్యటన : ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
భట్టి విక్రమార్క మల్లు పర్యటన.రేపు చండ్రుగొండ మండలం బెండాలపాడులో జరగనుంది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల సభను నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటకు సమీపంలోని నారంవారిగూడెం వద్ద ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ ఆవరణంలో నిర్వహించనున్న తరుణంలో ఈ సభకు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నందున, శాసనసభ్యులు
జారే ఆదినారాయణ ఉదయం సభా ప్రాంగణానికి చేరుకొని జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఏర్పాట్లపై అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి సమర్థవంతంగా కార్యక్రమం నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు అధికారులు సమిష్టిగా పని చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
