
పెద్దపల్లి జిల్లా :
గోదావరిఖని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్ మీడియా సమావేశం, పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ
రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్ళు రావడం లేదని రైతులు ఆందోళనలు చేస్తున్నారని ఆయన అన్నారు.!
నీళ్ళు అందకా పంట పొలాలలు ఎండిపోతుంటే ఎండలు ఎక్కువకొడుతున్నాయి అంటూ కుంటీ సాకులు చెప్తుంది కాంగ్రెస్ సర్కార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ, కేసిఆర్ మీద కోపంతో కుట్రపూరితంగానే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
శాసన సభలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియజేస్తామన్నారు..
NDSA నివేదికలు కూడా కాళేశ్వరం సురక్షితం అని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు.
రైతుల పంపు పొలాలకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాంది కదా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరు చేయకుండా ఎండబెట్టి గోదారినీ ఎండబెట్టాలి రానున్న రోజుల్లో ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు
కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ కాళేశ్వరం సేఫ్ అంటు ఒప్పుకున్నారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కొట్టుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుష్ప్రచారాలు చేసారని, కానీ
వర్షా కాలంలో 8 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని మేడిగడ్ఢ తట్టుకొని నిలిచిందన్నారు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు గోదారి నిండుకుండలా వుంది.
రామగుండంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వెళ్లి గోదారి చూస్తే తెలుస్తుందని హితవు పలికారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం తో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు
2 కోట్ల 90 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోచుకునేందుకు కళేశ్వరాన్ని ఎండబెట్టారని ఆరోపించారు.
రైతులు చస్తే మాకేంటి, ఇసుక అమ్ముకోవాలే అనే లక్ష్యమే కాంగ్రెస్ కు వుందన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డ రిపేరు చేసి రైతులను ఆదుకోవాలన్నారు
మేడిగడ్డ రిపేరు చేసే వరకు వెంట పడతాం… హెచ్చరించారు
కోరకంటి చందర్ మాట్లాడుతూ..
స్వరాష్ట్రంలో సాగు తాగు నీటి కష్టాలు తీర్చడానికి అపర భగీరథుడు గా కాళేశ్వరం నిర్మించారు కేసీఆర్ అని అన్నారు.
కాళేశ్వరం ఎండబెట్టి కుట్రలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలను నిజం చేయడానికే గోదారి నీ ఎండబెట్టారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను వివరించడానికి 180 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టామని తెలిపారు.
విజయవంతం అయినా పాదయాత్రను చూసి కాంగ్రెస్ నేతలు తట్టుకోవడం లేదన్నారు..
ఈ సందర్భంగా పాద యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, తెలిపారు
అనంతరం వారిని శాలువా తో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సత్కరించారు
