
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ప్రోహిబిటెడ్ సమస్య కొరకు వినతి పత్రం అందజేసిన
-నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125 డివిజన్ గాజులరామారం పరిధిలోని మహాదేవపురం వెంచర్ వారు 30సం|| గా అక్కడ 100 ఇండ్లకు పైగా నిర్మించుకున్నారు ప్రస్తుతం అక్కడ నూతనంగా రిజిస్టేషన్ మరియు పర్మిషన్ కొరకు వారు ప్రయత్నించగా వారి స్థలాలు ప్రోహిబిటెడ్ లో ఉన్నాయని స్థానిక ప్రజలు ఇబ్బందులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.. ప్రోహిబిటెడ్ సమస్య ఉందని మంత్రికి విన్నవించగా వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు..
