
భూ భారతపై అవగాహన: ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొంగులేటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
అశ్వారావుపేట మండల స్థాయిలో భూభారతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి భూ సమస్య అయినా భూభారతి చట్టంలో పరిష్కారం అవుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,అన్నారు
ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ.రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని ప్రతి ఒక్కరికి ఆధార్ గుర్తింపు ఉన్నట్లే భూమి ఉన్న ప్రతి వారికి ప్రభుత్వం “భూధార్ ” గుర్తింపు కల్పిస్తుందన్నారు గత ప్రభుత్వంభూములు లేని వారికి కూడా రైతుబంధు పేరుతో పాసు పుస్తకాలు తీసుకువచ్చి కోట్లలో ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారు అన్నారు గత ప్రభుత్వంలో భూ సమస్య వస్తే రైతులు ఎమ్మార్వో. ఆర్డీవో.కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగేవారు కానీ ఇప్పుడు భూభారతి చట్టంతో ఎవరి పరిధిలో వాళ్ళు పరిష్కరించవచ్చు పైలెట్ ప్రాజెక్టు తో కొన్ని మండలాలలో ఎప్పటికీ 5 లక్షల అప్లికేషన్లు భూభారతి చట్టంతో పరిష్కారం చేశారని అని అన్నారు. నూతన భూభారతి చట్టం జూన్ 2వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ మొగళ్ళపు చెన్నకేశవరావు జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, స్థానిక ఎమ్మార్వో వనం కృష్ణ ప్రసాద్. రెవిన్యూ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ అభిమానులు మండల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు
