TEJA NEWS

200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: మంత్రి సవిత

200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: మంత్రి సవిత
ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు పాలన చేనేతలకు స్వర్ణయుగం లాంటిదని మంత్రి సవిత అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ప్రతినెలా చేనేత ఎగ్జిబిషన్ పెడుతున్నామన్నారు. అలాగే చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని తెలిపారు. చేనేతలకు లేటెస్ట్ డిజైన్ సెంటర్లను ఏర్పాటు చేసి మొబైల్ షాప్స్‌ను పెంచుతామన్నారు. 90 శాతం సబ్సిడీతో ఫ్రెమ్స్, ఇతర పరికరాలను అందిస్తామని చెప్పారు.