గ్రామపంచాయతీ పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

WhatsApp Image 2025 04 25 at 14.22.27
TEJA NEWS

తెలంగాణ సచివాలయం

గ్రామపంచాయతీ పాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

రైల్వే రిటైర్డ్ అధికారి కె.వి. రావు రచించిన గ్రామపంచాయతీ పాలన పుస్తకాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సచివాలయంలోని తన చాంబర్లో ఆవిష్కరించారు. భారతదేశంలో పంచాయతీరాజ్ చరిత్ర మొదలుకొని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ సభలు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు, అర్హతలు, సర్పంచ్, సెక్రెటరీ నిధులు విధులు, గ్రామపంచాయతీ లో పన్నులు నిధుల వినియోగం, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్, గ్రామ ప్రగతి ప్రణాళిక లు.. ఇలా సమగ్ర విషయాలను క్రోడీకరించి పుస్తకాన్ని రూపొందించిన రచయిత కె.వి.రావును ఈ సందర్భంగా మంత్రి సీతక్క అభినందించారు. గ్రామపంచాయతీ పాలన పై అవగాహన పెంచుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో దోహద పడుతుందన్నారు. భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేల, స్థానిక ఎన్నికల కి తెలంగాణ సమాయత్త మవుతున్న సమయంలో ఇలాంటి పుస్తకం రావడం ఎంతో ఉపయోగకరమన్నారు మంత్రి సీతక్క.

You cannot copy content of this page