
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం, మాదారం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌళి మార్కెటింగ్ శాఖల మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు.స్థానిక శాసనసభ్యులు
జారే ఆదినారాయణ తో కలిసి పర్యవేక్షించారు. అనంతరం
ప్యాకేజీ నైన్ కింద అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామంలో జరుగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అభివృద్ధి పనుల ప్రగతిని కూడా వారు సమీక్షించారు. ఇరిగేషన్ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించి అనుకున్న సమయానికి రైతులకు నీరు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
