
వైసీపీ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం. జగన్ వారిని నమ్మించి వంచించాడు : మాజీమంత్రి ప్రత్తిపాటి.
చంద్రబాబు గతంలో మైనారిటీలకోసం అమలుచేసిన పథకాలను జగన్ రద్దుచేశాడు : పుల్లారావు.
ముస్లిం మైనారిటీలను జగన్ నమ్మించి వంచించాడని, అధికారంలో ఉండికూడా వైసీపీ వారికి తీవ్ర అన్యాయం చేసిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మాజీ కౌన్సిలర్ వేటపాలెం సుభానితో పాటు 50మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మాట్లాడుతూ, జగన్ 5 ఏళ్ల పాలనలో మైనారిటీలకు జరిగిన అన్యాయం, ద్రోహం రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగలేదన్నారు. ఏం తప్పు చేశారని వైసీపీ ప్రభుత్వం అబ్డుల్ సత్తార్, అబ్డుల్ సలాం కుటుంబాలను బలితీసుకుందని ప్రత్తిపాటి ప్రశ్నించారు. పసిబిడ్డ మిస్బాను పొట్టనబెట్టుకున్న నీచచరిత్ర వైసీపీనాయకులదన్నారు. మైనారిటీల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన నిధుల్ని జగన్ సర్కార్ నవరత్నాలకు మళ్లించి, వారికి తీరని అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో మైనారిటీలకు ప్రత్యేకంగా అమలుచేసిన అనేక పథకాలను జగన్ రద్దుచేశాడన్నారు. ఆఖరికి వక్ఫ్ భూముల్ని వైసీపీ నేతలు ఆక్రమించుకుంటున్నా జగన్ పట్టించుకోలేదన్నారు.
కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ప్రత్తిపాటి, తాజాగా ఇమామ్, మౌజన్ లకు జీతాల చెల్లింపు పథకాన్ని చంద్రబాబు పున: ప్రారంభించారన్నారు. ముస్లింల హక్కుల్ని కాపాడే విషయంలో కూటమిప్రభుత్వం రాజీపడబోదని పుల్లారావు స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన వేటపాలెం సుభాని మాట్లాడుతూ.. 13 వ వార్డుల్లోని మైనారిటీ వర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు నేడు మాజీమంత్రి సమక్షంలో టీడీపీలో చేరామన్నారు. తొలుత కాంగ్రెస్ లో ఉన్న మేం, తర్వాత వైసీపీలో చేరామని.. ఆ పార్టీలో ఉన్నంతకాలం తమను నమ్ముకున్న మైనారిటీల కుటుంబాలకు న్యాయంచేయలేకపోయామన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు, అహంకారపు చర్యల వల్లే చాలామంది వైసీపీని వదిలేసి, ఇతరపార్టీల్లో చేరుతున్నారన్నారు. ఈ సందర్భంగా వేటపాలెం కరిముల్ల, ఉస్మాన్, వరపర్ల కరిమల్ల, అబ్దుల్ రెహమాన్, మస్తాన్ వలి, రఫీ, జానీ తదితరులు పార్టీ జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, క్లస్టర్ ముల్లా కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.
