మైనారిటీల పక్షపాతి కేశినేని చిన్ని

TEJA NEWS

మైనారిటీల పక్షపాతి కేశినేని చిన్ని

కూటమి ప్రభుత్వం రాక తో ఎంపీ చిన్ని ప్రశ్న తో పార్లమెంట్ వేదిక గా మైనారిటీల అభివృద్ధి పై చర్చ

చర్చ కు ఫలితం గా పి ఎమ్ జె వి కే పథకం కింద 8.76 కోట్లు విడుదల చేసిన కేంద్రం

తమ హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా మాట్లాడిన జన నేతకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నీరాజనం పలికిన మైనారిటీలు

ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాలలో ఎంపీ చిన్ని చిత్రపటానికి పాలాభిషేకాలు

విజయవాడ(తూర్పు నియోజకవర్గం, లబ్బిపేట) మైనారిటీల అభ్యున్నతి సంక్షేమమే లక్ష్యంగా పార్లమెంట్ వేదికగా పిఎంజేవీకే ( ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ) పథకం కింద మైనారిటీలకు జరుగుతున్న అభివృద్ధి పై కేటాయించిన నిధులపై వారి అభ్యున్నతి మరియు పురోగతిపై తీసుకునే నిర్ణయాలపై ఎంపీ చిన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నను లేవనెత్తడంతో కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ తరుపున మైనారిటీ శాఖ మంత్రి సమాధానం ఇస్తూ ఎంపీ చిన్ని ప్రశ్నకు కేంద్ర సమాధానంగా మైనారిటీలకు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం పథకం కింద 8.76 కోట్లు విడుదల చేసినట్లు తెలియజేశారు ఈ విషయంపై ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మైనారిటీలంతా సంబరాలు జరుపుకుంటున్నారు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మైనారిటీల పక్షాన మాట్లాడి వారికి అండగా నిలిచిన ఎంపీ చిన్ని చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు విజయవాడ వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో ఉన్న మైనారిటీలంతా విజయవాడ తూర్పు నియోజకవర్గం లో ఉన్న లబ్బీపేట ప్రాంతంలో ఎంపీ చిన్ని చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు

ఈ సందర్భంగా మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ కరిముల్లా మాట్లాడుతూ ముందుగా మైనారిటీల పక్షపాతిగా ఉన్న ఎంపీ కేశినేని చిన్ని కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గడచిన ఐదు సంవత్సరాలలో మైనారిటీల అభివృద్ధి అభ్యున్నతి స్థితిగతులపై పార్లమెంటులో మాట్లాడిన వారే లేరని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2025-26 సంవత్సరంలో 101కోట్ల రూపాయలు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం( పి ఎం జె వి కే ) పథకం కింద ఇచ్చారని ఎంపీ చిన్ని ఈ పథకం అమలు మరియు తీసుకుంటున్న నిర్ణయాలు మైనారిటీ నుంచి వ్యక్తమవుతున్న విషయాలపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించడంతో మరోసారి ఈ పథకం నుండి మైనారిటీలకు 8.76 కోట్ల రూపాయలు అందించడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ప్రశ్న లేవనెత్తిన ఎంపీ కేశినేని చిన్నికి మైనారిటీలంతా ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలియజేశారు క్రీడలు మహిళా సాధికారత, అభివృద్ధి విద్య మైనారిటీలు అన్ని విధాల ఉన్నత స్థానంలో ఉండి వారి ఆర్థిక ఎదుగుదలకు సైతం ఈ పీఎం జెవీకే పథకం ఉపయోగపడుతుందని తెలియజేశారు దీంతో ఈ ప్రశ్నలు లేవనెత్తి నందున మైనారిటీలంతా ఎంపీ చిన్నికి కృతజ్ఞతలు తెలుపుతూ విజయవాడ మూడు నియోజకవర్గాల్లోనూ మైలవరం జగ్గయ్యపేట నందిగామ తిరువూరు మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ ఎంపీ చిన్నికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ చిన్ని చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు భవిష్యత్తులో మైనారిటీలు అంతా ఎంపీ చిన్నికి అండగా ఉంటామని స్పష్టం చేశారు

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా,ఫిరోజ్,షరీఫ్, సిరాజ్, నూరుద్దీన్, కరీం,ఎమ్ డి ఇంతియాజ్ మరియు మైనారిటీ మహిళలు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top