మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన మిథుల నగర్ ప్రజలు

WhatsApp Image 2025 09 23 at 2.37.33 PM
TEJA NEWS

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన మిథుల నగర్ ప్రజలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం డివిజన్ మిథులానగర్ లో రెండు రోజుల క్రితం హైడ్రా అక్రమకట్టడాలను కూల్చివేసిన అనంతరం నిరాశ్రయులైన మిథుల నగర్ ప్రజలు *కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * నివాసం వద్దకు వచ్చి వారి ఆవేదనను వ్యక్తం చేశారు..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నిరాశ్రయులైన ప్రజలకు న్యాయం జరిగేల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఇంచార్జ్ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్ళి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలతో పాటు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page