TEJA NEWS

పాక్‌కు వత్తాసు పలికిన MLA అరెస్ట్.. దేశద్రోహం కేసు నమోదు

పహల్గాంలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే, అస్సాంలోని మంకాచార్ నియోజకవర్గానికి చెందిన ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం.. పహల్గాం ఘటనలో పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లు ఆరోపణలున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సీరియస్ అయ్యారు. సీఎం ఆదేశాలతో ఎమ్మెల్యేని అరెస్టు చేసి, దేశద్రోహం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.