
శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవముల్లో MLA బొండా ఉమ
ధి:-13-2-2025 గురువారం మధ్యాహ్నం12:30″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం నందు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణం సందర్భంగా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో 1000 మంది భక్తులకు అన్నదానం తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగినది…
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా :- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర గారు పాల్గొని ముందుగా తిరుపతమ్మ గోపయ్య దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది…

ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ:-స్వామివారు, అమ్మవార్ల కల్యాణ మహోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని, ఆ స్వామి వారు, అమ్మవార్ల కృప మన అందరి పై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు, కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకుని, అమ్మవారి ఆశీర్వాదాలను తీసుకుని, ప్రజలందరినీ ఎటువంటి కష్టాలు రాకుండా కాపాడాలని ప్రార్థించి, అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ సెంట్రల్ నియోజకవర్గం పై ఉండాలని వేడుకుని వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందించడం చాలా సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా బొండా ఉమా గారు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో:- దేవస్థానం కమిటీ వారు, లబ్బా వైకుంఠం, బత్తుల కొండా, కోలా శ్రీను, మోదుగుల గణేష్, కాసిమ్, పైడి శ్రీను, పెద్ది శ్రీను, లబ్బా దుర్గ, దాసరి ఉదయశ్రీ, తదితరులు పాల్గొన్నారు
