Spread the love

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా – MLA బొండా ఉమ

పార్టీ ఆవిర్భావం సందర్భంగా పలువురు సీనియర్ నాయకులను సన్మానించిన – MLA బొండా ఉమ

పార్టీ కార్యకర్తను ఆర్థికంగా వృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నారన్న -MLA బొండా ఉమ

సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏర్పాటుచేసిన తెలుగుదేశం జెండాను ఎగురవేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ “శ్రీ ” నందమూరి తారకరామారావు విగ్రహాలకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పులమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి వృద్ధులకు, పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ, మజ్జిగ పంపిణీ, నిరుపేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమాలలు నిర్వహించడమైనది…

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :- 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం ఈరోజు అటువంటి నాయకులను సన్మానించుకొని వారి కష్టాన్ని గుర్తించి సన్మానించడం జరుగుతుందని…

తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా,తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా,తెలుగు వారి, ఆత్మగౌరవాన్ని చాటిన జెండా,తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త, గుర్తింపు ఇచ్చిన జెండా,ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా, రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా, భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా మన తెలుగుదేశం పార్టీ జెండా అని…

దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు అని, అందువల్లనే కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించింది అని, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇస్తూ కష్టపడిన వారిని గుర్తిస్తూనే ఉంటుందని, రాజకీయాలలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు అని మరోసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ బొండా ఉమ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు…

ఈ కార్యక్రమాలలో:- తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు…