TEJA NEWS

కమ్యూనిటీ హాల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కార్పొరేటర్

ఫతేనగర్ డివిజన్ పరిధిలోని సమతా నగర్ కాలనీలో 50 లక్షల ఎమ్మెల్యే నిధులతో నిర్మించబడ్డ మహిళా మండలి మరియు కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ కలిసి ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు మాట్లాడుతూ స్థలం కోర్టు వివాదం లో ఉన్నప్పటికీ కాలనీవాసుల కోరిక మేరకు కార్పొరేటర్ ఆధ్వర్యంలో కాలనీవాసులు నా దృష్టికి తీసుకురావడంతో స్థలం వ్యవహారం కోర్టులో ఉన్న చర్చల ద్వారా నేను ఐదు లక్షలు మరియు కార్పొరేటర్ రెండు లక్షలు ఇచ్చి స్థల వివాదాన్ని పరిష్కరించాను అనంతరం 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యే నిధులతో కమ్యూనిటీ హాల్ మరియు మహిళా భవనాన్ని రెండంతస్తుల భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం
మిగతా మౌలిక సదుపాయాలు కూడా దాదాపు అన్ని పూర్తి చేయడంతో కాలనీ అభివృద్ధి చెందింది ఇంకా ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కాలనీవాసులకు సూచించడం జరిగింది
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచి బిక్షపతి జనరల్ సెక్రెటరీ సుదర్శన్ రెడ్డి అధ్యక్షులు రాజేందర్ సతీష్ గౌడ్ జనరల్ సెక్రెటరీ నరసింహ కన్నయ్య సుధాకర్ రెడ్డి సత్యనారాయణ లింగస్వామి ఏఎస్ ప్రసాద్ కేబీఎన్ నారాయణ వి వెంకటేష్ పాల్గొనారు