
ముఖ్యమంత్రితో నియోజకవర్గ అభివృద్ధి పై చర్చించిన ఎమ్మెల్యే:బుడ్డా రాజశేఖరరెడ్డి
రాజు శ్రీశైలం
ఆత్మకూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఉదయం వెలగపూడి లోని క్యాంప్ కార్యాలయం నందు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కలిసి పలు నియోజకవర్గ అభివృద్ధి పనులు, సమస్యలను సిఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ప్రధానంగా నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు అంశాలపై ముఖ్యమంత్రి తో ఎమ్మెల్యే చర్చించడం జరిగింది. శివభాష్యం సాగర్ ప్రాజెక్టు, బుడ్డా వెంగళరెడ్డి సాగర్ సిద్దాపురం ఎత్తిపోతల పథకం నుంచి ఇందిరేశ్వరం, కృష్ణాపురం, శ్రీపతిరావు పేట మరియు వెంకటాపురం గ్రామాలకు ప్రత్యేక కెనాల్ ఏర్పాటు చేసి సుమారు 5446 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు, ప్రాజెక్టు ప్రధాన కాలువల లైనింగ్ మరియు పంప్ హౌస్ అండర్ గ్రౌండ్ కేబుల్ తరచూ సమస్యలు తలెత్తుతుందడంతో ఓవర్ హెడ్ కేబుల్ లైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు అందజేయం జరిగింది.
అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ త్రాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన నాన్ అమృత్ స్కీం పనుల గురించి, కేసి కెనాల్ లైనింగ్, సిద్దాపురం ఎత్తిపోతల పథకం వద్ద ఎన్టీఆర్ స్మృతి వనం ఏర్పాటు తదితర అంశాలపై సిఎం తో చర్చించడం జరిగింది. ఇందుకు సిఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తో పాటు శ్రీశైలం మండల ఇంచార్జీ వై.యుగంధర్ రెడ్డి అన్నారు.
