TEJA NEWS

ట్రాఫిక్ పోలీసులకి ఉచిత మజ్జిగ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

ఉదయం 9 గంటలకు నరసరావుపేట పట్టణంలో స్టేషన్ రోడ్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు హెచ్ టివి న్యూస్ మెట్రో శ్యామ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రాఫిక్ పోలీసులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చే ప్రారంభించబడినది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఎండాకాలం దృష్ట్యా మెట్రో శ్యామ్ దాతల సహకారంతో రెండు నెలలపాటు మూడుపూటల మజ్జిగ ప్యాకెట్లు అందించడం హర్షణీయమని తెలియజేసినారు.
అనంతరం నాగసరపు సుబ్బరాయ గుప్త మాట్లాడుతూ శ్యాము తన టీవీని ఛానల్ నడుపుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం తన సేవా నెరతికి నిదర్శనం అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో కపిలవాయి విజయ్ కుమార్, వనమా సాంబశివరావు, తాళ్లూరి సత్యనారాయణ, బత్తుల మురళి, చేగు వెంకటేశ్వరరావు వెల్లంపల్లి కేశవరావు, వంకాయలపాటి రవి, గోదా రమేష్, దోగి పర్తి విజయ్ కుమార్ ,కుక్క మూడీ ప్రసాద్,చింతిరాల మీరయ్య,పిడతల రమాదేవి, పూనూరి కృష్ణకుమారి, కాల్వ రవి, చింతపల్లి లాజర్ బత్తుల వెంకటేష్ గాంధీ, కొనకి సాంబశివరావు, ట్రాఫిక్ సిఐ లోకనాథం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు