
నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సాక్షిత పటాన్చెరు :
ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేసుకున్న అనంతరం కోలుకుంటున్న నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్రెడ్డి ని హైదరాబాదులోని ఆయన నివాసంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. భగవంతుని కృపతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్ ఉన్నారు.
