Spread the love

ఫర్నిచర్ షాప్ దగ్ధం పరిశీలించిన ఎమ్మెల్యే

80 లక్షల ఫర్నిచర్ దగ్ధం, ప్రభుత్వ సాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ

* వనపర్తి :
వనపర్తి పట్టణం 22వ వార్డు బాలాజీ నగర్ కు చెందిన జీవన్ రావు ఫర్నిచర్ షాపు ప్రమాదవశాత్తు కాలిపోయింది

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు

ఈ ప్రమాదంలో షాప్ లో ఉన్న సోఫా సెట్లు, కుర్చీలు, తలుపులు, దర్వాజాలు, డ్రెస్సింగ్ టేబుల్లు, టేబుల్ల తో పాటు గృహోపకరణానికి సంబంధించిన కట్టె ఫర్నిచర్, టేకు కట్టే ఇలాంటివి పూర్తిగా కాలిపోయాయని దాదాపు 80 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు జీవన్రావు పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితుడు మాట్లాడుతూ ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని ఇలాంటి అజ్జయిర్ ఎప్పుడు వద్దని బాధితుడుని ఎమ్మెల్యే ఓదార్చారు

కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ సత్యం సాగర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, మాజీ కౌన్సిలర్ వెంకటేష్, ఎల్ఐసి కృష్ణయ్య, బి కృష్ణ, నక్క రాములు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు