TEJA NEWS

RWS మండలాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జారె.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం.గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న అశ్వారావుపేట దమ్మపేట ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి చండ్రుగొండ మండలాల ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ సమీక్షా సమావేశం నిర్వహించి వేసవికాలం దృష్ట్యా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి మంచినీళ్లకు అసౌకర్యం కలగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకొని రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా బోర్లు మోటార్లు అవసరమైనచో ప్రతిపాదనలు అందించాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ సలీం, ఏఈలు సాయికృష్ణ, వరప్రసాద్,సతీష్ కుమార్ పాల్గొన్నారు.