TEJA NEWS

సంతలో నిత్యవసర సరుకులను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రాత్రి దమ్మపేట సంతలో సామాన్యుడిలా నిత్యవసర సరుకులు కొనుగోలు చేశారు. టీ షర్ట్ నైట్ ప్యాంటు ధరించి సాదాసీదాగా సంతలో తనకు ఇష్టమైన ఎండు చేపలు, ఆకుకూరలు,కూరగాయలు పండ్లు కొనుక్కున్నారు. సంత బయట బండి వద్ద సోడా తాగారు. తన సతీమణి, కూతురు కోసం పూలు కొనుగోలు చేశారు. బయట నుండి వచ్చిన వ్యాపారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అని తెలియలేదు.