TEJA NEWS

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఇందిర సౌర జలవికాసం అనే నూతన పథకం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన, శుభసందర్భంలో ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన రైతులు వ్యవసాయ రంగంలో ముందుంటూ అభివృద్ధి చెందాలనే ఆలోచనతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద చండ్రుగొండ మండలం,
బెండాలపాడు గ్రామాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో ఈనెల 10వ తారీకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖల మంత్రి
శ్రీ భట్టి విక్రమార్క ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంలో బెండాలపాడు గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను ఐటిడిఏ పీవో బి రాహుల్ ,స్థానిక ఎంపీడీవో అశోక్, ఎమ్మార్వో సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించిన శాసనసభ్యులు
జారే ఆదినారాయణ.