
పాఠశాల మొదటి యాన్యువల్ డే ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువులోనూ ముందుండాలి.
విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చుతూ పాఠశాలకు నూటికి నూరు శాతం హాజరైన విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఘన సన్మానం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఎంపీయుపిఎస్ పాఠశాలలో నిర్వహించిన మొదటి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్ లు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి వారి చేతుల మీదుగా బహుమతులు అందించారు. అలాగే పాఠశాలలో విద్య పరంగా ఉత్తమ ప్రతిభ కనబరుచుతున్న విద్యార్థులను అలాగే నూటికి నూరు శాతం హాజరు కలిగిన విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.బహుమతులు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్య యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంఈఓ ప్రసాద్ రావు, కాంప్లెక్స్ హెచ్ఎంలు షాహినా బేగం, వీరేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖరరావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.
