TEJA NEWS

పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం.

దమ్మపేట మండల కేంద్రంలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులను అభినందించారు . జ్ఞాపికలు వారి చేతుల మీదుగా అందించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ కీసరి లక్ష్మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.