
ప్రతి పేదవానికి నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించాలి:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .
చేవెళ్ల నియోజకవర్గం:- నవాబ్ పేట్ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రజా పంపిణీ పథకంలో భాగంగా చౌక ధరల దుకాణాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అనంతరం నవాబ్ పేట్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.20,02,320/- (రూపాయలు ఇరవైలక్షల రెండువేల మూడువందలఇరవై) విలువ గల 20 కల్యాణ లక్ష్మీ / షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
