Spread the love

చేవెళ్ల నియోజకవర్గం:-

పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సర్కారు సాయం:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” గారు.

చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” శంకర్ పల్లి పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శంకర్ పల్లి మునిసిపాలిటీ మరియు మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన Rs.35,04,060/- (రూపాయలు ముప్ఫైఐదులక్షల నాలుగువేలఅరవై) విలువ గల 35 కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

పేద ప్రజలకు CMRF తో మెరుగైన వైద్య సేవలు…

అనంతరం శంకర్ పల్లి మున్సిపాలిటీ మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.22,77,500/- (రూపాయలు ఇరవైరెండులక్షల డెబ్బైఏడువేల ఐదువందలు) విలువ గల 46 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.