
మహా శివరాత్రి మహోత్సవానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేత…
130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీకి చెందిన శ్రీశ్రీశ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఈనెల 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. స్వామి వారి కృపా కటాక్షములతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడంలో నా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరి చందు, ప్రభాకర్, నాగరాజు పటేల్, నరేష్, మహేష్, వైభవ్, పవన్, శశి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
