TEJA NEWS

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే నాని

తిరుపతి: తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని తిరుమల నగర్ లో వెలసిన శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా గంగమ్మ జాతరను నిర్వహించారు. జాతరకు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి మహిళలు, గ్రామస్తులు కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతరలో అమ్మవారికి ఎమ్మెల్యే పులివర్తి నాని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గంగ జాతరకు విచ్చేసిన ప్రజలను, భక్తులను ఎమ్మెల్యే నాని ఆత్మీయంగా పలకరించారు. ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని ప్రజలు సుఖసంతోషాలతో… ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.