Spread the love
  • ఎమ్మెల్యే- SDF నిధులు రూ.2 కోట్ల 56 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే ఆదనపు తరగతి గదులు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన :- PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ *

మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండా లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 50.00 యాబై లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే అదనపు తరగతి గదులను మండల విద్యాధికారి వెంకటయ్య , కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు చంద్రనాయక్ తండా లోని ప్రాథమిక పాఠశాల లో మౌళికవసతుల కల్పనలో భాగంగా అదనపు తరగతి గదులను శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.. అధునాతన సకల హంగులతో, కొత్త సొగసును సంతరించుకుంటున్నాయి. చూడముచ్చటైన తరగతి గదులు…. క్లాస్‌రూంలో డ్యూయల్‌ డెస్క్‌లు.. విద్యుత్తు వెలుగులు.. పరిశుభ్రమైన టాయిలెట్లు.. స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంక్‌లు.. వంటగదులు.. భోజనశాలలు.. వాకింగ్‌ ట్రాక్‌లు.. చుట్టూ ప్రహరీలు.. ఇలా అనేక సకల సదుపాయాలతో విద్యార్థులు ఏకాగ్రతతతో నిశ్చింతగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లాదకర వాతావారణాన్ని పంచిపెడుతున్నాయి. పిల్లల చదువులకు సరికొత్త భరోసాను అందిస్తున్నాయి. నేడు ప్రభుత్వ పాఠశాలు అసలు సిసలు సరస్వతీ నిలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయి అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాల వసతుల తో ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు అని .ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించడమే ధ్యేయం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కలిపించడం జరిగినదిఅని, మిగతా పాఠశాలలను దశల వారిగా పూర్తి చేసి శేరిలింగంపల్లి ని ఆదర్శవంతమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ తెలియచేశారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు:

1.మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండా లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 50.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే అదనపు తరగతి గదులను పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో TSEWIDC EE రాంకుమార్, DE కలిముద్దీన్, AE శ్యామ్ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.