
మాజీ మంత్రి పై ఆరోపణలు నిరూపించకపోతే ఎమ్మెల్యే రాజీనామా చేయాలి……… బి ఆర్ ఎస్ డిమాండ్
కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఎమ్మెల్యే తీరు
నిరాధారమైన ఆరోపణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు
వనపర్తి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత 18 నెలలుగా పలుమార్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతిపరుడు భూ కబ్జా దారుడుగా పత్రికా సమావేశాల్లో ఆరోపణలు చేస్తూ చిత్రీకరించి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది మెగా రెడీ లబ్ది పొందారని నిరంజన్ రెడ్డి పై చేస్తున్న ఆరోపణలు నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణపురం మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ పెబ్బేరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కర్ర స్వామి ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతిపరుడు 100 ఎకరాల భూ కబ్జాదారుడు అని పదే పదే ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారని గద్వాల జిల్లా ఎర్రవల్లి కృష్ణా నది పరివాహకం వద్ద నిరంజన్ రెడ్డి భూ కబ్జా చేశాడని బిజెపి నాయకులు రఘునందన్ రావు వి6 ఛానల్ ద్వారా నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వము వారిదే అధికారులు వాళ్ల వారే అయినప్పటికీ ఎర్రవల్లి వద్ద చేసిన సర్వేలో రెండు ఎకరాల 19 గుంటలు ఎక్కువగా ఉందని అది టెక్నికల్ ప్రాబ్లం తో సర్వేలో తేలడం జరిగిందని 100 ఎకరాల కబ్జా జరిగిందని ఆరోపణలకు విరుద్ధంగా సర్వేలో మాత్రం రెండు ఎకరాలు తేలడం పట్ల కొండను త్రవ్వి ఎలుకను పట్టిన చందంగా ఎమ్మెల్యే తీరు ఉందని మిగతా 98 ఎకరాలు పరిస్థితి ఏంటో ఆయన సమాధానం చెప్పాలని దుయ్యబట్టారు అయినా అక్కడ ప్రత్యూష శివారెడ్డి లపై ఉన్న భూములు పై సర్వేలు చేయడం జరిగిందని అక్కడ ఒక ఎకరా కూడా నిరంజన్ రెడ్డి పై ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని ఒకవేళ సర్వేలో కబ్జా కు గురైందని తేలితే అక్కడ సంబంధిత కలెక్టర్ రెవెన్యూ అధికారులు ప్రకటించాల్సి ఉంటుందని అలా జరగలేదన్నారు
కాబట్టి నిరంజన్ రెడ్డిని పార్టీకి రాజీనామా చేయాలని చెప్పడానికి నీవు ఎవరో అని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరాధారణమైన ఆరోపణలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధిపై అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు 8 ఏళ్ల క్రితం మీ ప్రస్థానం ఎక్కడో ఎమ్మెల్యే మరిచారని ఇతర రాష్ట్రాల్లో సబ్ కాంట్రాక్టర్ గా ఉన్న మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కాంట్రాక్టర్ సర్టిఫికెట్ తో పాటు కాంట్రాక్టులను ఆ తర్వాత పెద్దమందడి ఎంపిటిసి గా గెలిపించి ఎంపీపీగా నిలబెట్టింది నిరంజన్ రెడ్డి పుణ్యమే కాదా అని ప్రశ్నించారు బుద్ధారం చెరువు గణపురం రిజర్వాయర్ పనులను మెగా రెడీకీ అప్పజెప్పితే ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో మాకు తెలుసని అలాగే 40 ఏళ్లుగా ఎండోమెంట్ పూజారుల మధ్య గ్రామ పంచాయతీకి చెందిన 30 ఎకరాల పెబ్బేరు సంతను కబ్జా చేయడంలో మాజీ మంత్రి హస్తం ఉందని మున్సిపాలిటీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యే తన దండుతో వచ్చి సమావేశంలో గొడవ చేయడం విశేషమని తీరా చూస్తే ఇప్పుడు సంత ఊసే లేదన్నారు రాష్ట్రంలోనే అత్యధిక ంగా ఆదాయం కలిగిన పెబ్బేరు సంత ఇప్పుడు ఆదాయం కోల్పోయిందని ఇది వారి నిర్వాహకమే అని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తన సొంత మండలం పెద్దమందడి మండలంలో దేవాలయ భూములపై ఇతర అక్రమాలపై దృష్టి సారించామని ఇదే ప్రభుత్వ హయాంలోనే ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా ఎండగడతామని అప్పుడు నియోజకవర్గ ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ విజయ్ కుమార్ సునీల్ వాల్మీకి మంద రాము ఆలీమ్ శంకర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు
