TEJA NEWS

బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎమ్మెల్యే
*
వనపర్తి నియోజకవర్గం లోని
పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన బూసని అశోక్ కుమారుడు గౌతమ్ ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదంలో కాళ్లను కోల్పోయాడు_

ఈ క్రమంలో వైద్యం చేయించుకునేందుకు తమ ఆర్థిక స్తోమత లేదని, వైద్యపరమైన ఆర్థిక సహాయ సహకార అందించాలని కుటుంబ సభ్యులు శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ని కోరడంతో అందుకు స్పందించిన ఆయన ప్రభుత్వ పరంగా చికిత్స నిమిత్తం 1లక్ష 25 వేల రూపాయల LOC ని మంజూరు చేయించారు

మంజూరైన LOC ని మంగళవారం ఎమ్మెల్యే హైదరాబాదులోని తన కార్యాలయం లో బాలుడి తండ్రి అశోక్కు అందజేశారు

ఆపద కాలంలో ఆర్థిక స్తోమత లేని తమ కుటుంబానికి ఎమ్మెల్యే అండగా నిలిచారని అడిగిన వెంటనే ప్రభుత్వపరంగా LOC మంజూరు చేయించి తన కుమారుడికి వైద్యపరమైన సహాయం అందించినందుకు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేశారు