
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
కులగణనను నివేదికను కాల్చడంతో పాటు పలు వర్గాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)పై కాంగ్రెస్ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా గత నెల 6న కాంగ్రెస్ క్రమశిక్షణ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని షోకాజ్ నోటీసుల్లో గుర్తు చేసింది.
ప్రభుత్వ కీలక విషయాలను పబ్లిక్‌గా మాట్లాడడం, అలాగే పలు వర్గాలపై అసభ్యకరమైన విధంగా వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలను పార్టీ తప్పుగా ప్రస్తావించింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణా కమిటి కోరింది.
అయితే పార్టీ షోకాజ్ నోటీసులకు తీన్మార్ మల్లన్న ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు..
