TEJA NEWS

వేలూరు గ్రామంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చిలకలూరిపేట రూరల్ :
భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభను జయప్రదం చేసిన గ్రామ ప్రజలు

MRPS మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీ నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పటిష్టం చేద్దాం….

అభినవ అంబేద్కర్, మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆశయాలను, సిద్ధాంతాలను, ఆకాంక్ష లను మాదిగల, అణగారిన వర్గాల ప్రజలలో చైతన్యాన్ని తీసుకొద్దాం…

చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో…..

అత్యంత ఘనంగా పండుగ వాతావరణం లో అభినవ అంబేద్కర్, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలను మరియు MRPS 31 వ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించడం జరిగింది…

సంఘ పెద్దలు,గ్రామస్తులు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం మొదలైన ర్యాలీ వర్షం లోనే మూడు గంటల పాటు జరిగింది. ముందుగా నాయకులకు గ్రామస్తులు బస్సు షెల్టర్ వద్ద ఘనంగా స్వాగతం పలకడం జరిగినది. గ్రామంలో ర్యాలీ నిర్వహించి మాదిగ పల్లెలో ఉన్నటువంటి గుర్రం జాషువా గ్రంధాలయం వద్ద ఎమ్మార్పీఎస్ జెండాను మాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల వద్ద జరిగిన బహిరంగ సభలో దొడ్డ రామకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు కొండేపాగ క్రాంతి కుమార్ మాదిగలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వేలూరు గ్రామం నుంచి ఆడి ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో కీలకంగా పనిచేసి బస్సు దాన కేసులో జైలుకు వెళ్లిన వారిని ఈ సందర్భంగా సన్మానించడం జరిగినది. అనంతరం నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్యమంలో భాగంగా జీవిత తగలబెట్టిన వారికి సన్మానం జరిగినది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 150 మంది విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగినది. గ్రామంలో 10వ తరగతి ,ఇంటర్లో అత్యున్నత మార్కులు వచ్చిన విద్యార్థులకు జ్ఞాపికలను బహుకరించి సన్మానం చేశారు. తదుపరి అభినవ అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 60వ జన్మదినోత్సవాలను 15 కిలోల కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా శుభాకాంక్షలు కార్యక్రమంలో వేలూరు గ్రామ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ పెద్దలు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, సంఘస్తులు, గ్రామ ప్రజలు, యువకులు మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.