బుధ. మార్చి 11th, 2026

టీటీడీకి మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వాహనం విరాళం

WhatsApp Image 2025 09 19 at 5.54.03 PM
WhatsApp Image 2025 09 19 at 5.54.03 PM
TEJA NEWS

టీటీడీకి మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వాహనం విరాళం

తిరుమల: శ్రీవారికి బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య విద్యా సంస్థలకు చెందిన ఎం.ఎస్.సుందర్ రామ్ అనే భక్తుడు అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసేందుకు రూ.14 లక్షల విలువైన అశోక్ లేల్యాండ్ కంపెనీకి చెందిన బడా దోస్త్ మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వాహనాన్ని శుక్రవారం విరాళంగా అందించారు. దీంతో పాటు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి వాహనం తాళాలు, డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, డిఐ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు.

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page