
వంశధార ప్రాజెక్టును ఆధునీకరణ చేపట్టాలని అసెంబ్లీలో మోరపెట్టుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్
విజయవాడ :
పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న వంశధార ప్రాజెక్టును ఆధునీకరణ చేయాలని
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం అసెంబ్లీలో సంబంధిత మంత్రి వర్యులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ద్వారా తెలిపారు. వంశధార ప్రాజెక్ట్లోని ఎడమ మరియు కుడి కాలువల ఆయకట్టు చివరి ఎకరా వరకూ సాగునీరు అందించాలని అన్నారు. అలాగే లెఫ్ట్,రైట్ కెనాల్లో 100 ఎంఎం సిసి లైనింగ్ ఏర్పాటు చేయాలని, ఆయకట్టులో భాగంగా ఎత్తైన భూములకు నీరందించడానికి అవసరమైన చోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం పూర్తిగా ఇరిగేషన్ను నిర్వీర్యం చేసిందని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఎంజీఆర్ అన్నారు.
