Spread the love

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా మొగిలి దుర్గప్రసాద్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన మొగిలి దుర్గాప్రసాద్ ను బిజెపి రాష్ట్ర పార్టీ రెండవసారి నియమించడం జరిగింది. గతంలో 1995 లో భారతీయ జనతా పార్టీలో చేరి ఎబివిపి లో జిల్లా రాష్ట్రస్థాయిలో అనేక బాధ్యతలు నిర్వహించి బిజెపిలో పట్టణ ఉపాధ్యక్షుడిగా మండల ప్రధాన కార్యదర్శిగా యువమోర్చా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగర్ కర్నూల్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సంస్థగతంగా అనేక బాధ్యత బాధ్యతలు నిర్వహించి కల్వకుర్తి నియోజకవర్గం లో పార్టీ పటిష్టతకు కృషి చేయడం జరిగింది. సందర్భంగా మొగిలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణం నుండి రాష్ట్రస్థాయిలో బాధ్యతలు నిర్వహించడం సంతోషకరమని నా నియమకాన్ని కృషి చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తల్లోజు ఆచారి బిజెపి నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో బిజెపి అధికారంలోకి తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు.