Spread the love

రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికతో ముందుకు:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఆలపాటి రాజా విజయాన్ని కాంక్షిస్తూ…ఎమ్మెల్యే రాము ప్రచారం

గుడివాడ రాష్ట్ర భవిష్యత్తు గురించి పట్టభద్రులందరూ ఆలోచించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సత్యనారాయణపురంలోని సిద్ధార్థ కళాశాల మరియు వార్డులోని పట్టభద్రుల ఇళ్లకు వెళుతూ ఎమ్మెల్యే రాము ప్రచారం నిర్వహించారు.

సిద్ధార్థ పాఠశాల ప్రిన్సిపల్ చోడవరపు విజయ్ కుమార్, కె.వి. కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ కొమ్ము వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యా యులు, పట్టభద్రుల్ని కలిసి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించారన్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరో వైపు రాష్ట్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మద్దతుగా నిలవాలని పట్టభద్రులకు ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు.

గుడివాడ పట్టణ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, వార్డు అధ్యక్షులు కృష్ణారావు, పలువురు టిడిపి నాయకులు రాము వెంట ప్రచారంలో పాల్గొన్నారు.