
రాష్ట్రపతి అల్పాహార విందుకు హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన అల్పాహార విందు కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , స్పీకర్ ఓం బిర్లా, బి.జె.పి జాతీయ అధ్యక్షుడు ఎంపి జెపి నడ్డా, కేంద్రమంత్రులు, సహచర ఎంపిలతో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అల్పాహార విందుకు ఆంధ్రప్రదేశ్ , కేరళ, కర్ణాటక, హార్యానా రాష్ట్రాలకు చెందిన ఎంపిలను ఆహ్వానించారు. ఈ విందులో పాల్గొన్న ఎంపిలందర్నీ కలిసి వారి పార్లమెంట్ నియోజకవర్గ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ అల్పాహార విందుకు ఆహ్వానించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
