
ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
భావితరాల భవిష్యత్తు అమరావతి రాజధాని
డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఆంధ్రుల కలల రాజధానికి మళ్లీ జీవం
గన్నవరం : అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఘన స్వాగతం పలికారు. కేరళ లోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రాయానికి పీఎం మోదీ చేరుకున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు పీఎం నరేంద్రమోదీకి ఎంపి కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అమరావతి రాజధాని భావితరాల భవిష్యత్తుగా తయారు కానుందని ఒక ప్రకటనలో పేర్కొన్నరు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వల్ల ఆగిన పోయిన రాజధాని నిర్మాణ పనులకి డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మళ్లీ జీవం వచ్చిందన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల కల సాకారం కానుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గ్లోబల్‍సిటీగా అమరావతి అవతరించనుందని పేర్కొన్నారు.
