TEJA NEWS

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ ఈటెల రాజేందర్ ని మర్యాదపూర్వకంగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ కలిశారు..

కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ హిందూ స్మశాన వాటిక పక్కనుండి రైల్వే అండర్ పాస్, గాయత్రి నగర్, వివేకానంద నగర్, పర్వత్ నగర్ వైపు వెళ్ళే రోడ్డు కొరకు, మరియు డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో నూతనంగా కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని, అలాగే రాజీవ్ గాంధీ నగర్ మీదుగా రైల్వే గుడ్ షెడ్ వైపు వెళ్లే రోడ్డు రైల్వే అధికారులు గత కొంతకాలంగా దారిని మూసి వేయడం వలన నిత్యం మూసాపేట్ వైపు వెళ్లే దారి లేక నిత్యం ప్రయాణిస్తున్న ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారిందని, అలాగే రాజీవ్ గాంధీ నగర్ హిందూ స్మశాన వాటిక పక్క నుండి రైల్వే అండర్ పాస్ గ్లాస్ ఫ్యాక్టరీ మీదుగా మోతినగర్ వైపు వెళ్లెందుకు అనుకూలంగా ఉంటుందని ఆయనకు వివరించగా దానికి వారు సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ తెలిపారు.