Spread the love

ఎంపీ వద్దిరాజు తీర్థాల సందర్శన

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ పుణ్య దంపతులు తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.మహా శివరాత్రి సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి ఉదయం ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర స్వామిని దర్శించుకుని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు.వారు మహదేవుడికి కొబ్బరికాయలు కొట్టి,శివలింగానికి గజమాల వేసి, పంచామృతాలతో అభిషేకం చేశారు.వేద పండితులు ఎంపీ రవిచంద్రను కండువాతో సత్కరించి,పుణ్య దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు వెంట ఆయన చిరకాల అభిమానులు సుంకర చిరంజీవి,కిరణ్,ఆకుల సాయి, మద్దెల భానుప్రతాప్,ఆకుల పోతురాజు తదితరులు ఉన్నారు.