
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర ప్రముఖులతో కలిసి కొత్త మిట్టపల్లి సభలో
దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే పాకిస్థాన్ కుట్రలు,కుతంత్రాలను
సమర్థవంతంగా తిప్పిగొడుతున్న రక్షణ దళాలకు మనమందరం సెల్యూట్ కొడదామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.పహల్గాంలో అమాయకులైన పర్యాటకులను అమానుషంగా పొట్టన పెట్టుకున్న ముష్కరుల చర్యలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు మనమంతా తీవ్రంగా ఖండించడం జరిగిందన్నారు.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా యావత్ దేశమంతా రక్షణ దళాలకు అండగా ఉందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొత్త మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ స్వర్గీయ రాయల వెంకట శేషగిరిరావు విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, కేటీఆర్ కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నందున రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్ ద్వారా ఇక్కడకు రావడం జరిగిందన్నారు.కేటీఆర్ కి దివంగత రాయల శేషగిరిరావుపై ఉన్న అభిమానంతో హెలికాప్టర్ ద్వారా ఇక్కడకు చేరుకోవడం జరిగిందని వివరించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు పార్టీ అభివృద్ధికి,తల్లాడ ప్రాంత ప్రజల సంక్షేమానికి శేషగిరి రావు చేసిన సేవలను కొనియాడారు.బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పర్యటనలో ఎంపీ రవిచంద్రతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు,రేగా కాంతారావు,బానోతు మదన్ లాల్,కందాళ ఉపేందర్ రెడ్డి,మెచ్చా నాగేశ్వరరావు,కొండబాల కోటేశ్వరరావు,హరిప్రియ నాయక్, నాయకులు లింగాల కమల్ రాజ్,దిండిగాల రాజేందర్,ఆర్జేసీ కృష్ణ, బమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.
