
MSME ఇండస్ట్రియల్ పార్క్ నియోజకవర్గం నకు ఒక వరం – మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు టోల్గేట్ వద్ద APIIC ఆధ్వర్యంలో నూతన MSME ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఇండస్ట్రియల్ పార్క్ నియోజకవర్గానికి ఒక వరమని మొదటిగా 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తారని దీనిని 100 ఎకరాలకు విస్తరించవచ్చు అని మొదటిగా 15 కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
మార్కాపురంలోని ఎస్టేట్లో ఏ రకంగా పరిశ్రమలు ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈ పార్క్ ని అభివృద్ధి చేస్తామని ఇండస్ట్రియల్ పార్కులో వివిధ రకాల పరిశ్రమలు త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని తద్వారా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు వందల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించబోతున్నాము అని అన్నారు.
అదే రకంగా రిలయన్స్ సంస్థ వారు 1500 కోట్ల రూపాయలతో త్వరలో నియోజకవర్గంలో ప్లాంట్ నెల కల్పబోతున్నారని తద్వారా రైతులకు ఎకరానికి 30 వేల రూపాయల కౌలు లభించబోతోందని వందల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయని వేల సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పించబోతున్నామని అన్నారు.
ఇక్కడి నుండి రామాయంపట్నం పోర్టు 100 కిలోమీటర్లు, ఎయిర్పోర్టు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని ఈ ప్రాజెక్టు కూడా నేషనల్ హైవే పక్కనే ఉందని అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ పారిశ్రామిక వాడలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ అధికారులు, తర్లుపాడు మండల ప్రజలు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
