Spread the love

చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్ళనున్న ముదిరాజ్ మత్సకార నాయకులను బైండోవర్ (అరెస్టు) చేసిన పోలీసులు

తెలుగు ముదిరాజ్ మత్సకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చంతవరకు పోరాటం ఆగదని హెచ్చరిక వనపర్తి తెలుగు మత్స్యకార ముదిరాజులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక వారిని నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల నాయకులు మార్చి 21న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని
చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న,పుట్ట బాలరాజు జిల్లా చీఫ్ ప్రమోటర్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం (DFCS) వనపర్తి, ప్రమోటర్ ఉందేకోటి నాగేంద్రం, జిల్లాలో అన్ని మండలాల ముఖ్య నాయకులను అర్ధరాత్రి వారి వారి ఇళ్లల్లో అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లి వారి సొంత పూచికతపై పోలీసులువదిలివేయటం జరిగింది .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
2023 అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి CM కామారెడ్డి బిసి డిక్లరేషన్ సభల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగు ముదిరాజ్ మత్స్యకారులకు BC- నుండి BC-A కు మారుస్తానని హామీ ఇచ్చి, మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని, 2025 – 26 సంవత్సరం బడ్జెట్ సమావేశంలో తెలుగు ముదిరాజ్ మత్స్యకారులకు బడ్జెట్ కేటాయించకుండా మొండి చేయి చూపించింది రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ఉన్న తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లిందిని, ఇచ్చిన హామీలను మర్చిపోయింది, అసెంబ్లీ సమావేశాల్లో బిసి డి నుంచి బిసి ఏ కు మార్చాలని కనీసం చర్చకు కూడా తీసుక రాలేదు అని 2024 – 25 సంవత్సరం ఉచిత చాప పిల్లలు పంపిణీ కార్యక్రమంలో 90 కోట్ల చాప పిల్లలు ఇస్తామని 50% అంటే 40 కోట్లు చేప పిల్లలను సరఫరా చేస్తామని చెప్పి,19 కోట్ల చేప పిల్లలు మాత్రమే సరిపడా చేయటం జరిగింది.
కొన్ని జిల్లాల్లో అవి కూడా ఇవ్వకుండా మధ్యలోనే ఆపేసి మత్స్య కారులను మోసం చేసింది, మత్స్యకారులను మర్చిపోయిన ప్రభుత్వానికి కనువింపు కలిగించే సమయం దగ్గరలోనే ఉన్నది హెచ్చరించారు.
ఎన్ని అరెస్టులు చేసిన తెలుగు ముదిరాజ్ మత్స్యకారులకు ఇచ్చిన హామీలు అమలై న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు.